Sunday, February 24, 2013

ఈ వారం శ్లోకం

అనిర్వేద శ్రియో మూలం అనిర్వేదం పరం సుఖం 
అనిర్వేదోయి సతతం సర్వార్థేషు ప్రవర్తకః 12వ సర్గ 10వ శ్లోకం ఉత్సాహమే సంపదకు మూలం ఉత్సాహమే పరమ సుఖం ఉత్సాహం కలిగి ఉంటె సాధించనిదేమీ లేదు అన్నది ఈ శ్లోకం తాత్పర్యం. ఈ శ్లోకం, దాని తాత్పర్యంతో పాటు గురువుగారు ఇచ్చిన వ్యాఖ్యానం ఈ కింది జెపిజిలో ఉన్ది. చదవండి... ఇది గురూపదేశం తీసుకుని పారాయణ చేసుకోవాల్సిన శ్లోకం.. గమనించండి...

Saturday, February 23, 2013

నేటి శ్లోకం

సుందరే సుందరో రామః సుందరే సుందరీ కథా సుందరే సుందరీ సీతా సుందరే సుందరం వనమ్ సుందరే సుందరం కావ్యం సుందరే సుందరః కపిహి సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరం? సుందరకాండ వైభవాన్ని తెలియచేసే శ్లోకం ఇది. రామచంద్ర మూర్తి సత్య వాక్కుల్లో సౌందర్యం, ఏక పత్నీ వ్రతంలో సౌందర్యం, సీతాదేవి పాతివ్రత్యంలో సౌందర్యం, హనుమ సేవా భావంలో సౌందర్యం, కావ్య మాధుర్యంలో సౌందర్యం సీతాదేవి ఉన్న వనంలో సౌందర్యం సుందరకాండ శ్లోకాల్లో సౌందర్యం అన్నింటి కలబోత సుందరకాండ. ఇది చదివిన వారి విన్న వారి ఆత్మ సౌందర్యం వికశిస్తుంది. మనిషి మనీషి అవుతాడు. కష్టాలని అవలీలగా అధిగమించగల ధైర్యం లభిస్తుంది. అందుకే ఈ గ్రంథం నిత్య పారాయణీయం, అనుసరణీయం.

Friday, February 22, 2013

సుందరకాండ శ్లోకాలు అర్ధం

మన బ్లాగ్ కి హిట్ లు రోజు రోజుకీ పెరుగుతున్నాయి.శుక్రవారం ఒక్క రోజులోనే 50 మంది బ్లాగ్ ని సందర్శించారు. బ్లాగ్ ఆసక్తిగా చూస్తున్న వారికీ అవకాశం ఉన్నంతవరకు ప్రతి రొజూ కొత్త విషయం అందించాలన్న ఆలోచన వచ్చింది. రొజూ సుందరకాండలోని ఓక శ్లోకం, దాని అర్ధం పోస్ట్ చేస్తే ఎలా ఉంటుందనిపించిది. గురువుగారికి చెబితే చాలా బాగుంటుందని వెన్ను తట్టి ప్రోత్సహించారు. కానీ ఉద్యోగ బాధ్యతలు, ఇతరత్రా వత్తిడుల వల్ల ఒక్కో రోజు శ్లోకం పెట్టలేకపోవచ్చు. వీలైనంత వరకు కచ్చితంగా అనుకున్నది పాటిస్తాను. చుడండి... తరించండి... ఈ ప్రయత్నాన్ని ఆశిర్వదించండి... అయితే ఒక్క గమనిక కొన్ని శ్లోకాలు గురూపదేశం లేకుండా పారాయణ చేయకూడదు. అలాంటివి పోస్ట్ చేసినప్పుడు ఉపదేశం అవసరం అని ఒక హెచ్చరిక కూడా పెడతాను. అలాంటి శ్లోకాలు మాత్రం పారాయణ చెయవద్దు. గురువుగారు సుందరకాండ చేస్తున్నప్పుడు ఉపదేశం ఇస్తూ ఉంటారు... అలాంటి సమయంలో ఉపదేశం తీసుకుని పారాయణ చేసుకోండి... జై హనుమాన్...మరో మనవి... బ్లాగ్ సందర్శించిన వారు మీ కామెంట్స్ కూడా రాస్తే ప్రోత్సాహకరంగా ఉంటుంది....

త్రుటిలో తప్పిన ప్రమాదం

తపసా సత్య వాక్యేన అనన్యత్వాచ్చ భర్తరి ఆపి సా నిర్దహేదగ్నిం న తామగ్ని ప్రధక్ష్యతి సుందరకాండ 55వ సర్గలో 29వ శ్లోకం ఇది. తన తపోబలం చేతను సత్య భాషణ చేతను శ్రీరాముని నిరంతరం ధ్యానించే సీతాదేవి అగ్నినే దహిస్తుంది తప్ప అగ్ని ఆమెను దహించలేదు అంటారు హనుమ. మన గురువుగారికి కూడా అది వర్తిస్తుంది. నిరంతరం హనుమ ధ్యానంలోనే ఉంటూ మనందరినీ నిత్యం పలకరిస్తూ తన ఆశీస్సులు అందించే ఆయన్ను ఏ ప్రమాదాలు దరి చేరవు. నిన్న రాత్రి దిల్ సుఖ్ నగర్ లో జరిగిన పేలుడు ప్రమాదం నుంచి ఆయన త్రుటిలో బయట పడడమే ఇందుకు నిదర్శనం. క్షణాల ముందు అక్కడే ఉన్న ఆయనను ఒక ఫోన్ కాల్ తో సాక్షాత్తు హనుమే రక్షించారు. గురువుగారు నిండు నూరేళ్ళు చల్లగా ఉండి మనందరికీ హనుమ ఆశీస్సులు అందచేస్తూనే ఉండాలని ప్రార్ధన.