Saturday, November 30, 2013

ఈ వారం శ్లోకం 7

శ్లో - చతుర్ణామేవ హి గతిర్వానరాణాం మహాత్మనాం
      వాలి పుత్రస్య నీలస్య మమ రాజ్ఞశ్చ ధీమతః
తా - లంకకు రాగలుగుటకు నలుగురికే సాధ్యము. వాలి పుత్రుడైన అంగదుడు, నీలుడు, బుద్ధిశాలి యగు మా ఏలిక సుగ్రీవుడు మరియు నేను (ఆంజనేయ స్వామి)
వివరణ - ఆంజనేయ స్వామివారు సీతాన్వేషణకై పయనమై త్రికూట పర్వత శిఖరం మీద లంకా నగర ప్రాకారాన్ని చేరుకుంటాడు. దుర్భేద్యమైన లంకను చూసి హనుమంతుడు, దీన్ని దేవతలు కూడా జయించలేరు... ఈ నగరాన్ని చేరుకునే వారిలో పైన వివరించిన నలుగురు మాత్రమే రాగలరు అనుకుంటారు...
వ్యాఖ్యానము - జీవాత్మ అరిషడ్వర్గములచే బంధింపబడి ఉంటుంది. ఆ బంధము నుండి జీవుడిని విముక్తి చేసి తిరిగి పరమాత్మను చేర్చు వాడు ఆచార్యుడే... గురువు ద్వారానే ఈ కార్యము సాధ్యమవుతుంది. ఇక్కడ సీతమ్మ జీవాత్మ... రాముడు పరమాత్మ... రావణుడు అరిషడ్వర్గములు...ఆచార్యుడు ఆంజనేయ స్వామి...రావణుని సర్వ నాశనం చేసి సీతమ్మను రాముని చేర్చు వాడు ఆంజనేయుడు. అనగా అరిషడ్వర్గముల బంధము నుండి జీవాత్మను తప్పించి భగవంతుని చేర్చు వాడు ఆచార్యుడు.
ఇక్కడ మారుతి, నలుగురము మాత్రమే లంకకు రాగలమన్నాడు. వారు అంగదుడు, నీలుడు, సుగ్రీవుడు మరియు తాను... ఇందులో అంగదుడు శక్తి... నీలుడు యుక్తి... సుగ్రీవుడు భక్తి... అంగదుడు ఒకే లంఘనములో శత యోజనముల సముద్రమును దాటి లంకలోనికి ప్రవేశించగలడు... తిరిగి రావడానికి శక్తి పున్జుకోవలసి ఉంటుంది. అది వేరే విషయం. అందు వలన శక్తి ద్వారా అంగదుడు లంకను చేరగలడు. నీటిలో రాయి పడవేస్తే తేలే శక్తి నీలుడుకి ఉంది. అందుచేత లంకకు వారధి నిర్మించి రాగలడు. అనగా యుక్తితో లంకను చేరగలడు. ఇక సుగ్రీవుడు భక్తికి ప్రతీక... వాలి నుండి తన భార్య రుమను, కిష్కింధ సామ్రాజ్యమును రాముడు ఇప్పించినందుకు ఆయనకు విధేయుడయ్యాడు.. కాబట్టి రాముని విధేయుడుగా ఆతను కూడా లంక చేరగలడు. అయితే ఈ మువ్వురిలో ఎవ్వరు కూడా రాక్షసులను తప్పించుకుంటూ సీతాన్వేషణ గావించే శక్తి లేని వారు... వివిధ రూపాలు ధరించి షష్టిర్యోజన విస్తీర్ణమైన లంకలో తిరగగలిగిన శక్తి ఒక్క మారుతికే ఉంది... కాబట్టి జీవాన్వేషణ, అరిషడ్వర్గ బంధ విముక్తి ఒక్క ఆచార్యునికే ఉంటుందని స్వామి వారు ఈ శ్లోకము ద్వారా మనకు తెలియజేస్తున్నారు...
సర్వే జనాః స్సుఖినో భవంతు

Monday, November 18, 2013

సహస్ర దీపోత్సవం


ప్రగతి నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ పట్టాభి రామాంజనేయ ఆలయంలో కార్తీక పౌర్ణమి పర్వ దినాన ద్విశత సుందరకాండల ప్రవచన కర్త శ్రీమాన్ శృంగారం సింగరాచార్యుల వారి ఆధ్వర్యంలో సహస్ర దీపోత్సవం అత్యంత వైభవంగా జరిగింది... పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి సుందరకాండ ఆంజనేయ స్వామి వారికి కార్తీక దీపాలు సమర్పించి తరించారు... ఆ కార్యక్రమం దృశ్యాలు...

Saturday, November 16, 2013

వైభవంగా ముగిసిన 87 వ సుందరకాండ


ప్రగతినగర్ శ్రీ పట్టాభి రామాంజనేయ దేవస్థానంలో మన సుందరకాండ ద్వితీయాస్టోత్తర శతంలోని 87 వ సుందరకాండ ఆదివారం సహస్ర నామార్చనతో అత్యంత వైభవంగా ముగిసింది... దామరాజు వెంకటేశ్వర్లు, శ్రీదేవి అనే మా దంపతులకు కర్తలుగా కూర్చునే భాగ్యం లభించింది... ఊహించిన దాని కన్నా అద్భుతమైన స్పందన వచ్చింది... సుమారు 41 మంది కంకణధారణ చేసుకోగా 100 మంది వరకు సహస్ర నామర్చనలో పాల్గొని తరించారు...17 వ తేదిన సహస్ర దీపాలంకరణతో కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. కార్తీక పౌర్ణమి, కార్తీక సోమవారం కారణంగా తొలి రెండు రోజులు గురూజీ ప్రవచనాలకు కొంత అంతరాయం కలిగినా మంగళవారం నుంచి ప్రవచనాలు సంతృప్తికరంగానే జరిగాయి. అయితే తొలి రెండు రోజులు పూర్తి స్థాయిలో ప్రవచనాలు జరగకపోవడం వల్ల సుందరకాండ తత్త్వం అంతటినీ భక్తులకు సవివరంగా తెలియచేయలేక పోయానన్న స్వల్ప అసంతృప్తి గురువుగారికి ఉండిపోయింది... ఇలా జరగడం సుందరకాండలు ప్రారంభించాక ఇదే తొలి సారి...87వ సుందరకాండ కార్యక్రమాల్లో పాల్గొన్న అందరూ సుఖశాంతులతో వర్థిల్లాలని  గురువుగారు ఆశీర్వదిస్తున్నారు...
మొదటి రోజు కలశస్థాపన దృశ్య మాలిక ఇది...
వేదికపై కొలువైన స్వామి 
వేదికపై కొలువైన స్వామికి గురూజీ వందనం
దామరాజు దంపతులచే కలశస్థాపన

Friday, November 15, 2013

REACHED 8000 HITS MILESTONE

ANOTHER MILESTONE

We are continuously reaching NEW MILESTONES THIS YEAR...By Today ie., 16th NOVEMBER, 2013 we have achieved 8000 Global Hits milestone...This Blog officially launched two years ago @ Sri Pattabhi Ramanjaneya Devasthanam, Pragathinagar, Hyderabad... In two years we have achieved this milestone...In 11 months period ie., from December 2012...we have achieved many milestones...At that time we are @3500 Global Hits...In a period of 11 months we got 4500 Global Hits...Among the majority his are from our MOTHER LAND INDIA...Hits from other countries especially RUSSIA are increasing  day by day...THAT IS THE POWER OF HANUMA...This is the Success of our SUNDARAKANDA FAMILY...HEARTY CONGRATULATIONS TO ALL... 

OUR MILESTONES ARE AS FOLLOWS

1. November 16, 2013                   GLOBAL HITS CROSSED 8000
2. JULY 31, 2013                           GLOBAL HITS CROSSED 7000. 
3. JULY 04, 2013                            INDIAN HITS CROSSED 4000
4. JUNE 16, 2013                           GLOBAL HITS CROSSED 6000
5. MAY 2013                                 RECORD HITS IN A MONTH - 953
6. MAY 31, 2013                           RECORD HITS IN ONE DAY - 81    
7. MAY 26, 2013                           US HITS CROSSED 1000
8. MAY 19, 2013                           GLOBAL  HITS CROSSED 5000
9. APRIL15, 2013                         INDIAN HITS CROSSED 3000
10. JANUARY 17, 2013              GLOBAL HITS CROSSED 4000
11. DECEMBER 20, 2012         GLOBAL HITS CROSSED 3500

(మన బ్లాగ్ కి వచ్చిన హిట్ లను చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇది మన రాష్ట్రానికే పరిమితం కాలేదండీ. ప్రపంచంలో చాలా దేశాల వారు దీన్ని చూశారు. చూస్తున్నారు.ఈ కింది టేబుల్ చుస్తే ఆ విషయం తెలుస్తుంది).
EntryPageviews
India
     4852
United States
     1590
Russia
       559
Germany
       223
Ukraine
       223
Oman
        73
South Korea
        51
Latvia
        39
Malaysia
        42
UAEmirates
        37

TOTAL HITS      8003

Wednesday, November 13, 2013

కార్తీక సహస్ర దీపాలంకరణోత్సవం మరియు 87వ సుందరకాండ

 
FLEXI
ఉపదేశ శ్లోకం
తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ
హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖ క్షయ కరోభవ
తస్య చింత కరో యత్నో దుఃఖ క్షయ కరో భవేత్  

(ఇది గురూపదేశం పొంది మాత్రమే పారాయణ చేసుకోవలసిన శ్లోకం)

TODAY'S COVERAGE FOR OUR PROGRAMME