Thursday, May 2, 2013

ఏమి అదృష్టం మనది

ఈ రోజు ఉదయం మా టీవీలో చాగంటి కోటీశ్వర రావు గారు ప్రవచనంలో ఒక విషయం చెప్పారు.. అది విన్నాక మనం ఎంత అదృష్టవంతులమో అనిపించింది.. ఆ భావం మీ అందరితో పంచుకుంనేందుకే ఈ పోస్ట్
ఒక సారి ఒక శిష్యుడు రమణ మహర్షిని కలిసి ... మీరు తిరువన్నామలై వదిలి రారు... ఒక్క మాట కూడా మాట్లాడరు...మరి మీ అమూల్యమైన సందేశం మాకు అందేదెలాగ అని అడిగాడట... దానికి రమణులు సమాధానం ఇస్తూ నేను మాట్లాడే రోజు వచ్చినప్పుడు మాట్లాడతాను..అసలు ఈ లోకంలో ఒక గురువు సజీవంగా ఉండడమే ఒక వరం... అన్నారట... మరి మన గురూజీ మన మధ్య సజీవులుగా ఉండడమే కాకుండా మనతోనే కలిసి తిరుగుతూ నిరంతరం మన మంచి కోసం హనుమను ప్రార్ధిస్తూ  తరచు మనని పలకరిస్తూ ఉన్నారంటే మనం ఎంత అదృష్టవంతులమో కదా... ఔనంటారా... అలాగే అమ్మగారు కూడా ఎంతో ఆప్యాయంగా మనని పలకరించడం పూర్వ జన్మలో మనం చేసుకున్న చిన్న పుణ్యానికి హనుమ ఇచ్చిన వరం...గురువుగారు, అమ్మగారు పది కాలాల పాటు ఆయురారోగ్యాలతో ఉండాలని మనకి తమ ప్రేమను పంచాలని సీతాసమేత రామచంద్రుని, హనుమను ప్రార్థిస్తున్నాను...


HOW FORTUNATE WE ARE....
Today Sri Chaganti Koteswara Rao in his pravachana in MAA TV mentioned one thing...After hearing it I had the above said feeling...I want to share it to you all...

One disciple of Bhagavan Ramana Maharshi questioned him "you don't come out from Tiruvannamalai...you don't speak out...then how can we get your message"...Bhagavan replied in this way..."I will speak out when the time comes...why do you worry about my message...Actually having a Guru alive between you is a blessing..."

This is true to us...I feel We are blessed more than the Ramanulu told to his sishya...Our Guruji Sriman Singaracharya is between us...He always pray for us...He call us now and then to enquire about our well being...Even Amma also speak to us with ever smiling face whenever we go to their house...

I pray Almighty to give both of them a long and healthy life to enable them to give their blessings to all of us...